చిచ్చు పెట్టడమే బీజేపీ నైజం
మతవిద్వేషాలను రెచ్చగొట్టి, అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న ప్రజలను విడగొట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ నైజమాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు.
- మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజం
సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 15: మతవిద్వేషాలను రెచ్చగొట్టి, అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటున్న ప్రజలను విడగొట్టి ఓట్లు దండుకోవడమే బీజేపీ నైజమాన్ని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ దుయ్యబట్టారు. చైతన్యవంతమైన మునుగోడు ప్రజలు బీజేపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన సంస్థాన్ నారాయణపురంలో ప్రచారం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సృష్టించిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయాడని కర్నె ప్రభాకర్ నిప్పలు చెరిగారు.
కొన్నేండ్ల క్రితం మునుగోడు ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో చూసి ఓట్లు వేయాలని ఆ ప్రాంత ప్రజలను కోరారు. టీఆర్ఎస్ను గెలిపిస్తేనే అభివృద్ధిలో మునుగోడు పరుగులు పెడుతుందన్నారు. కాగా, మండలంలోని డాకుతండా, కొర్రతండా, చిల్లాపురం, లచ్చమ్మగూడెం గ్రామాల్లో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్.. వాయిల్లపల్లిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి-చంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జహీరాబాద్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ టీఆర్ఎస్ అభ్యర్థితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

