హనుమకొండ : భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ సమాజంలో వైషమ్యాలు సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ కుటిల యత్నాలు చేస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP Leader) ఆరోపించారు. లౌకిక వాదాని(Secularism)కి వ్యతిరేకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం హనుమకొండలో ఆయన మాట్లాడారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేసి ముస్లిం మైనార్టీల(Muslim Minorty) కు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిందని గుర్తుచేశారు. కాజీపేట రైల్వే కోచ్(Kazipeta Railway Coach) ఫ్యాక్టరీ అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. దేశంలో జనగణన చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణను వెంటనే మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు. దానికి అనుగుణంగా నిర్ణయాలు జరగాలన్నారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన ప్రకటన గురించి బండి సంజయ్ మాట్లాడకుండా అధికారంలోకి రాగానే తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ(BJP) అధికారంలో ఉందా? లేదా? దేశంలో ఉద్యోగాలు భర్తీ చేయనివారు రాష్ట్రంలో ఎట్లా చేస్తారు? అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ తీసుకువచ్చి సామాన్యులను బతికే పరిస్థితి లేకుండా చేసిందన్నారు.
ప్రతి ఒకరి ఖాతాలో రూ.15 లక్షలు, నోట్ల రద్దుతో వెలికి తీస్తామన్న నల్లధనం ఏమైందన్నారు. దేశవనరులను అదానీ(Adani), అంబానీ(Ambani)లకు కట్టబెడుతున్న నరేంద్ర మోదీ, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదానీ ఆర్థిక నేరాన్ని గుట్టురట్టు చేసిన హిండేన్‌బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక గురించి మాట్లాడకుండా ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని పార్లమెంట్‌కు రాకుండా మోదీ ప్రభుత్వం చేసిన కుట్రలు దుర్మార్గమన్నారు.