హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ): ఎస్ఈపీ (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-ఎన్ఈపీ) అమలు పేరుతో ఆరెస్సెస్ భావజాలాన్ని యూనివర్సిటీ సిలబస్లో చేర్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టీ సాగర్ ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్వోపీవో పేరుతో వేదగణితాన్ని జోప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
గురువారం ఎస్ఎఫ్ఐ ఇఫ్లూ యూనివర్సిటీ విభాగం నాలుగో మహాసభల్లో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యావిధానం పేరుతో దేశంలోని యూనివర్సిటీ విద్యార్థుల హకులను కేంద్రం కాలరాస్తున్నదని విమర్శించారు.