కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 30: హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను కూల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అవసరమైతే తమ ప్రాణాలను అడ్డు పెట్టి అయినా ప్రజల ఆస్తులను కాపాడతామని స్పష్టం చేశారు. సోమవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ ప్రాణాలను తీసిన తరువాతే హైడ్రా పేదల ఇండ్లపైకి వెళ్లాలని సూచించారు. జీతాలకే పైసల్లేక అల్లాడుతుంటే మూసీ ప్రక్షాళన పేరుతో అప్పు తెచ్చి దోచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని దుయ్యబట్టారు. హైడ్రా తీరు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొరివితో తలగోక్కుంటున్నట్టు ఉన్నదని అన్నారు.