BJP State President | హైదరాబాద్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ముహుర్తం కుదిరింది. ఇక కొత్త అధ్యక్షుడు కొలువుదీరనున్నాడు. ఈ క్రమంలో జులై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ నెల 29న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. అధ్యక్ష పదవి కోసం 30న నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పుడు కొత్తగా అధ్యక్ష పదవి ఎవర్ని వరిస్తుందో వేచి చూడాల్సిందే.