హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : బండి భగీరథ్ పారిపోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు.
సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా లీగల్ కేసు పెడితే చట్ట ప్రకారం యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చని తెలిపారు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోవడంతోనే భగీరథ్ సరెండర్ అయ్యాడని చెప్పారు. బెయిల్ పొందవచ్చని చట్టంలోనే ఉన్నదని, కేంద్ర మంత్రిని, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
బండి సంజయ్ తప్పు చేయలేదని, ఆయన కుటుంబ సభ్యులు తప్పు చేస్తే న్యాయపరంగా చర్యలుంటాయని చెప్పారు. బీజేపీని బద్నాం చేస్తున్నారని, భగీరథ్ అంశాన్ని కోర్టులే తేలుస్తాయన్నారు.