హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్మెంట్ను సీఎం రేవంత్‌రెడ్డి కోరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు.
సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తాను స్వయంగా ఫడ్నవీస్ కార్యాలయానికి ఫోన్ చేయగా, తెలంగాణ సీఎంవో నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదని చెప్పారని వివరించారు. రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలని ప్రశ్నించారు. ప్రజలు రేవంత్‌రెడ్డిని సీఎంని చేస్తే.. ఆయన పని కూడా కిషన్‌రెడ్డి చేయాల్నా? అని మండిపడ్డారు.
కాంగ్రెస్‌ది హిట్లర్ మనస్తత్వమని, అదే నియంతృత్వ ధోరణిని అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకోవడం వల్లనే కాంగ్రెస్ మూడు రాష్ర్టాలకు పరిమితమైందని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి, గాంధీ సరోవర్ ప్రాజెక్టులు ఏటీఎంలా మారాయని ఆరోపించారు.