హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడితే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది.
పార్టీ అంతర్గత వ్యవహారాలు మీడియాతో మాట్లాడొద్దని సూచించింది.