హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. జనార్ధన్ రెడ్డితోపాటు భారీ సంఖ్యలో వచ్చిన ఆయన అనుచర గణానికి మంత్రి కేటీఆర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ చేరికల కార్యక్రమంలో EFCO డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి, మెదక్ ఎన్నికల ఇన్చార్జి కంఠరెడ్డి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోడెంల లక్ష్మణ్ యాదవ్, అందే కొండల్ రెడ్డి, జె వెంకట్ రెడ్డి, టీ రమేష్ గుప్తా, ఆయా నేతల అనుచరులు 100 మంది పాల్గొన్నారు.