హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): విద్వేషంతో ప్రజలను విభజిస్తూ భరతజాతిని నిర్వీర్యం చేస్తున్న బీజేపీని మునుగోడు ఉప ఎన్నికలో ఓడించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ సింహాద్రి విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, అభివృద్ధి, సంక్షేమాన్ని కీలక అంశాలుగా పరిగణించి బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అక్కల బాబుగౌడ్, మారం తిరుపతియాదవ్, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.