హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజ య్, ఎంపీ ఈటల ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతున్నది. మంగళవారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఢిల్లీలో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కొత్త ఇంటిలో ఏర్పాటుచేసిన విందుకు రాష్ర్టానికి చెందిన ఐదుగురు బీజేపీ లోక్‌సభ సభ్యులు హాజరయ్యారు. ఈటల, అర్వింద్, రఘునందన్ రావు, డీకే అరుణ, గోడెం నగేశ్ హాజరయ్యారు.
ఈ విందులో పాల్గొన్న ఫొటోలతో కూడిన పోస్టులను ఈటల రాజేందర్, అర్వింద్ తమ ‘ఎక్స్’ ఖాతాల్లో షేర్ చేశారు. ఈ విందుకు కేంద్ర మంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్ హాజరుకాకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈటల వచ్చారనే బండి రాలేదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నది.