హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): బీజేపీలో కొందరు నేతలు తనతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
మంగళవారం పార్టీలో నేతల తీరుకు నిరసనగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి ఫుట్‌బాల్ గిఫ్ట్ ఇచ్చారు. విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో తన ఆవేదన వెలిబుచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం లోపించిందని తెలిపారు. ఈ విషయాలను చంద్రశేఖర్ తివారీ దృష్టికి తీసుకెళ్తే… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కలవాలని అంటున్నారని చెప్పారు. రాంచందర్‌రావును కలిస్తే మరోనేత అభయ్ పాటిల్‌ను కలవాలని సూచిస్తున్నారని తెలిపారు.