తేజస్వీ సూర్య సభ్యత్వాన్ని రద్దుచేయాలి : మంత్రి పొన్నం
తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే తన మాటలు వెనకి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే తన మాటలు వెనకి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. గురువారం గాంధీభవన్లో పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘తెలంగాణపై అవహేళనగా మాట్లాడిన తేజస్వీ సూర్య పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. తేజస్వీ మాటలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలి’ అని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటుపై లోక్సభ, రాజ్యసభలో పాస్ చేసిన బిల్లులను అవమానపరుస్తుంటే 8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు చీమూ, నెత్తురులేకుండా వినడం సిగ్గుచేటన్నారు. తెలంగాణపై తేజస్వీ మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, అమరవీరులను అవమానపరచడమే కాకుండా, ఉద్యమస్ఫూర్తికి విఘాతం కలిగించేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఎంపీ తేజస్వీ సూర్యపై చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఈ విషయాన్ని పరిశీలించి, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

