హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): పాస్‌పోర్ట్ రెన్యువల్ విషయంలో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కేంద్ర ప్రభుత్వంపై విజయం సాధించారు. విదేశాంగ శాఖపై గతంలో రఘునందన్‌రావు హైకోర్టులో కేసు వేయడంతో తాజాగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రఘునందన్‌రావు తన పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం నిరుడు మార్చి 13న హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో దరఖాస్తు చేశారు. కానీ, ఆయనపై క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉండటంతో రెన్యువల్ చేయలేదు. దీనిపై ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. రఘునందన్‌రావు దరఖాస్తును పరిశీలించాలని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌ను ఆదేశించింది. ఇదే సమయంలో రఘునందన్ రావుకు కొన్ని షరతులు విధించింది. గి