బీజేపీ ఎంపీ లక్ష్మణ్
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 22: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ నాయకుడు, ఎంపీ లక్ష్మణ్ విమర్శించా రు. గురువారం చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో జరిగిన విజయసంకల్ప యాత్రలో లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల అసెంబ్లీ ఎన్నిక ల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమ లు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీ ఎంపీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞ ప్తి చేశారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తనను ఎం పీగా మరోసారి గెలిపిస్తే చేవెళ్ల పార్లమెం ట్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. శంషాబాద్ పట్టణంలో ఫ్లైఓవర్‌ను నిర్మించిం ది మోదీ ప్రభుత్వమేనని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.