జగిత్యాల, మార్చి 30 : రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ ముస్లింలకు అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పోటీ చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో శనివారం నిర్వహించిన బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ ముస్లింలకు వత్తాసు పలకాడానికే జీవన్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారని విమర్శించారు.
తాను మాత్రం మోదీ సైనికుడినని, ఇక్కడ ఉన్న హిందువులకు, మన పౌరసత్వం లభించే హిందువులందరికీ అభ్యర్థిని అని చెప్పారు. జీవన్‌రెడ్డి ముస్లింలకు మద్దతు కోసమే పోటీ చేస్తున్నారని అన్నారు. ఇటీవల జీవన్‌రెడ్డి వీడియోలు వైరల్ అవుతున్నాయని, వాటిని చూస్తే ముస్లింలకు మద్దతుగా మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. హిందువులకు బీజేపీ అభ్యర్థిగా తాను ఉన్నానని, జీవన్‌రెడ్డి రోహింగ్యాలకు, బంగ్లాదేశ్ ముస్లింలకు మద్దతుగా ఉన్నారని, ఇదీ కాంగ్రెస్ సంస్కృతి అని మండిపడ్డారు.