హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ నుంచి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ఈటల రాజేందర్, రాజా సింగ్, రఘునందన్ రావును సస్పెండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసే వరకు ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.