BJP MLAs | హైదరాబాద్ : నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పును బీజేపీ సభ్యులు వ్యతిరేకించారు. కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టుకోవాలి అని అధికార కాంగ్రెస్ పక్షానికి సూచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును ప్రముఖ కవి, ఉద్యమకారుడు సురవరం ప్రతాప్ రెడ్డిగా మారుస్తూ అసెంబ్లీలో మంత్రి దామోదర రాజనర్సింహ బిల్లు ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీకి పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోండి.. కానీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పేరు మార్చకండి అని సూచించారు.
అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు అవివేకమైన చర్య. పొట్టి శ్రీరాములు ఒక ప్రాంతానికి పరిమితమైన నేత కాదు. దళితుల కోసం పోరాటం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం పేరు పెట్టాలి. సీఎం చెప్పినట్లు ఏపీలో పొట్టి శ్రీరాములు వర్సిటీ లేదు. పొట్టి శ్రీరాములు పేరుతో దేశంలో ఎక్కడా వర్సిటీ లేదు అని ఎమ్మెల్యే సూర్యనారాయణ పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీకి పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోండి.. కానీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పేరు మార్చకండి – బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి https://t.co/CQSbuVVgns pic.twitter.com/KmoIHeaV2y
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2025