హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): భారత సైన్యం ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసేలా ‘ఆపరేషన్ సిందూర్’ను కించపరిచేలా పోస్టులు పెట్టిన రాష్ట్ర విద్యాకమిషన్ అడ్వైజరీ సభ్యురాలు, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
‘ఆపరేషన్ సిందూర్’పై దేశం గర్వపడుతున్న సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టేలా, సైన్యాన్ని కించపర్చేలా సుజాత సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారని ఆయన మండిపడ్డారు. సుజాతను తక్షణమే అడ్వైజరీ బోర్డు నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.