సూర్యాపేట టౌన్, జూలై 7: కాంగ్రెస్, బీజేపీ అభివృద్ధి నిరోధక పార్టీలని, వాటివల్ల రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటకు చెందిన బీజేపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వల్దాస్ ఉపేందర్ 500 మంది నాయకులు, అనుచరులతో కలిసి శుక్రవారం సాయంత్రం బీఆర్ఎస్లో చేరారు. మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదన్నారు.
తొమ్మిదేండ్లుగా రాజకీయాలకతీతంగా అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధిపై చర్చ జరుగుతున్నదని, 2014కు ముందు, తర్వాత అభివృద్ధి, ప్రశాంత పాలనలో జరిగిన మార్పులపై ప్రజలంతా మాట్లాడుకుంటూ విపక్షాలను నిలదీస్తున్నారని అన్నారు. 60 ఏండ్లకుపైగా పా లించి అన్ని విధాలుగా ఆగం చేసిన విపక్ష పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదని, బీఆర్ఎస్ ప్రశాంత పాలనలో నిరంతర అభివృద్ధి పాలన కొనసాగుతున్నదని చెప్పా రు. అందుకే అంతా ఏకమై స్వచ్ఛందం గా గులాబీ గూటికి చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.