హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): బీజేపీ తనను పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ వాపోయారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తనకు గుర్తింపు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదని అన్నారు. బీజేపీలో ఇప్పటికే విజయశాంతి, చంద్రశేఖర్‌వంటి సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోతుండగా ఇప్పుడు రవీంద్రనాయక్ వారి సరసన చేరారు.