Peddapalli | పెద్దపల్లి టౌన్: బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ తనకే ఇవ్వాలని ఆ పార్టీ దళిత నాయకుడు మాతంగి హనుమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళులర్పించారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు. పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పాదయాత్ర చేయనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా మాతంగి హనుమయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన తాను గత 30 ఏండ్లుగా పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నానని, కార్యకర్త స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా అనేక పదవులు పొందినట్లు వివరించారు. 2018 ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేశానని, కానీ దక్కలేదన్నారు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ నాయకులు లాల్‌సింగ్ ఆర్యా, సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, అరవింద్ మీనన్, బండి సంజయ్, చంద్రశేఖర్‌ను కలిసి టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.