హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్రం నిధులను వినియోగిస్తూ ఇందిరమ్మ బొమ్మ పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పథకంలో భాగంగా మాజీ ప్రధాని వాజపేయి చిత్రాన్ని కూడా పెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన శాసనసభలో మాట్లాడారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం రూ.1.50 లక్షల కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం రూ.53 వేల కోట్లు కేటాయిందంటూ ఎద్దేవా చేశారు.