Bandi Sanjay | కడెం, నవంబర్ 9: ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో కార్యకర్తలందరూ సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడంతో వారిపై సంజయ్ ఫైర్ అయ్యారు.
ఇది వరకు సీఎం.. సీఎం అంటూ ప్రచారం చేసి.. తన రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఊడగొట్టారని ఆక్రోశం వెల్లగక్కారు. ఇక కాంగ్రెస్లో సీఎం పదవి కోసం పది మంది పోటీ పడుతున్నారని, ఎవరు సీఎం అనేది ఇప్పటికీ తేలలేదని చెప్పారు. ఆ పరిస్థితి బీజేపీకి వచ్చేలా కార్యకర్తలు వ్యవహరించవద్దని సూచించారు. దీంతో సభకు వచ్చిన కార్యకర్తలందరూ మౌనంగా ఉండిపోయారు.