హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ) : మతతత్వ, పెట్టుబడిదారీ బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు వామపక్షాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డీ రాజా పిలుపునిచ్చారు. ఢిల్లీలోని అజయ్భవన్లో శుక్రవారం సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశం ప్రకాశ్‌బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ.. వామపక్ష శక్తుల ఐక్యతకు సీపీఐ కృషి చేస్తున్నదని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ తరఫున సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తకళ్లపల్లి శ్రీనివాస్‌రావు నివేదిక సమర్పించారు. సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, కలవేణ శంకర్, బాలనరసింహ, ఎండీ యూసుఫ్, కార్యకర్తలు పాల్గొన్నారు.