హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ):బీజేపీ నాయకుల దిగజారుడుతనానికి ఇదో నిదర్శనం. తెలంగాణ అమరుల త్యాగాలకు ప్రతీకగా ఉన్న అమరవీరుల స్థూపాన్ని అంతా పవిత్రంగా, గౌరవంగా చూస్తారు. అయితే బీజేపీ నాయకులు హనుమకొండ అదాలత్ అమరవీరుల జంక్షన్ వద్ద ఉన్న స్థూపానికి గురువారం ఆ పార్టీ ఫ్లెక్సీ పెట్టారు. ఇది చూసిన వారంతా బీజేపీ నాయకులది గింత దిగజారుడుతనమా? అమరుల త్యాగాలను కించపరుస్తారా? అంటూ మండిపడుతున్నారు. – సుబేదారి