హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ‘బండి భగీరథ్‌పై నమోదైన కేసుతో ఆయన తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు సంబంధం లేదు. బీజేపీకీ ఎలాంటి సంబంధం లేదు’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తేల్చి చెప్పారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ తమ పార్టీ నాయకుడని, కేంద్రమంత్రి అని.. ఆయన కుటుంబ సభ్యులు ఏదైనా తప్పు చేస్తే ఆ వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని తెలిపారు. ఈ కేసు వ్యవహారం కుటుంబంలో జరిగిన సమస్య అని చెప్పారు.