హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ నిరుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యాఖ్యానించిన కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట లభించింది. కాంగ్రెస్ జనజాతర సభలో వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు రేవంత్‌రెడ్డిపై కింది కోర్టులో నమోదైన కేసును హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం తీర్పు వెలువరించారు.