ఆరెస్సెస్ దూతలమంటూ వచ్చిన స్వామీజీలు బీజేపీ కోసం ఎమ్మెల్యేలకు బేరాలు పెట్టే సందర్భంలో ఢిల్లీ పెద్దల పేర్లతో పాటుగా తమ పనివిధానం గురించి వెల్లడించిన విషయాలు దిమ్మెరపోయేలా ఉన్నాయి. వారు ఒకటొకటిగా చెప్తున్న విషయాలు థ్రిల్లర్లను మరపించే స్థాయిలో ఉన్నాయి.
రామచంద్రభారతి: అంతా సవ్యం గా పూర్తవుతుంది.. డోంట్ వర్రీ
ఎమ్మెల్యేలు: అంతా గోప్యంగా ఉంచాలి. ఇక్కడ కేసీఆర్ ఉన్నరు
నందకుమార్: మాదంతా డిఫరెం ట్.. అదే నేను చెప్తున్న
సింహయాజి: సంతోష్‌జీ ఏమన్నారంటే.. స్వామిజీ మీరు మాట్లాడండి అన్నరు. అయితే నేను చెప్పేది వినండి. సంతోష్‌ను ఇక్కడికి రమ్మని, మాట్లాడి ఎక్కడికక్కడ సెటిల్ చేసుకొని అప్పుడు ఢిల్లీకి పోయి అక్కడ జాయిన్ అవండి. అది బెటర్.
ఎమ్మెల్యేలు: మా ఉద్దేశం ఏమిటంటే మేం మునుగోడు పోకుండ ఉండలేం. ఇప్పటికే ఎట్లనో ఉన్నది. మళ్లీ అటూ ఇటూ కాకుండా పోతమని. మధ్యల ఇరుకుతమని. అదిగాకుండా ఆయన పొద్దున్నే చెప్తున్నరు. ఇంటెలిజన్స్ వాళ్లకు ఫోన్లు దూరం పెట్టు అని.
సింహయాజి: అన్ని ఎట్ల అట్లనే ఉంటయ్. గవర్నమెంట్లో ఉన్నట్లే ఆపరేషన్ చేశాం కదా. మహారాష్ట్ర గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ లేదా ? మరి ఎట్ల సాధ్యమైంది? వాళ్లకు కూడా రాడార్స్ ఉన్నయి
రామచంద్రభారతి: అమిత్‌షా లైన్లోకి రావడం లేదు.
సింహయాజి: ఇప్పుడు మాతో నలుగురు సిద్ధంగా ఉన్నారన్నమాట.
ఎమ్మెల్యేలు: స్వామిజీ ఇప్పుడు ముందు ఏం చేద్దాం?
రామచంద్రభారతి: ఫస్ట్ డెలివరీ సెషన్. అక్కడ అమిత్‌షా ఉంటరు. సంతోష్ అమిత్‌షాకు ఫోన్ చేస్తూనే ఉన్నరు. కంటిన్యూగా బీజీ వస్తున్నది.
ఎమ్మెల్యేలు: కొద్దిసేపు ఉంటాం.
రామచంద్రభారతి: కావాలంటే మీరు వెళ్లండి. కానీ నేను వెళ్లను. అన్ని పనులు వదులుకొని ఢిల్లీ నుంచి వచ్చా. అన్నింటికంటే మించి మా ఇంటికి దగ్గరలోనే రేపు అమిత్‌షా మీటింగ్ ఉంది.
సింహయాజి:అందరు ఒకే కారులో వచ్చారా?
ఎమ్మెల్యేలు: హా.. అందరం ఒకే కార్ల వచ్చినం.
సింహయాజి: ఎవరి వెహికిళ్ల వాళ్లు వస్తే ఏమైంది?
ఎమ్మెల్యేలు: మా కార్లు వస్తే డ్రైవర్లు, గన్మెన్లు వస్తరు. గన్మెన్లు, డ్రైవర్లు, పీఏల ద్వారానే బయటకు పొక్కుతుంది
సింహయాజి: పూజ.. స్వామిజీ అని చెప్తే అయిపోయేది. మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టరు కదా.