హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా 17 మంది ఇన్చార్జీలను నియమించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యం లో వీరిని నియమించినట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
వీరితోపాటు కొత్తగా అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పతంగి బ్రహ్మనంద్, భూపాలపల్లికి నిషిధర్రెడ్డి, నారాయణపేటకు శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వర రావును నియమించారు.