మేడ్చల్ : మునుగోడు నియోజకవర్గ ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం అరెగూడెంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని మునుగోడు ప్రజలంతా భావిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలు మునుగోడులో ఎన్ని డ్రామాలు ఆడినా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. అనంతరం మంత్రి మండలంలోని లింగోటం గ్రామంలోని పరిశ్రమలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యంతో చర్చించారు.