కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేటలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గోసుల శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో గొల్ల, కుర్మల సంఘం నాయకులు గులాబీ పార్టీకి మద్దతు పలికారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషిచేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రతిని శ్రీనివాస్‌యాదవ్‌కు అందజేశారు. గొల్ల, కుర్మ కుటుంబాలకు గొర్రెల పంపిణీ, ఆసరా పింఛన్, రైతుబంధు, ఉచిత కరెంటు, రైతుబీమా వంటి పథకాల అమలును చూసి పార్టీకి మద్దతు తెలిపినట్టు చెప్పారు. కార్యక్రమంలో గొల్ల, కుర్మల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముడెద్దుల వెంకటస్వామియాదవ్, ఎంపీటీసీ ఎడ్ల ఓదెలుయాదవ్, గొల్ల, కుర్మ నాయకులు రవికుమార్‌యాదవ్, మహిపాల్‌యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.