టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శనివారం నాడు ఒక అభిమాని కరెన్సీ నాణెలతో కవిత ముఖచిత్రాన్ని తయారు చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పగా… మరికొందరు యువకులు అరేబియా సముద్రంలో మోటార్ బోట్లపై తిరుగుతూ కల్వకుంట్ల కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పుడు మరొక యువకుడు మరింత వినూత్నంగా కవితక్కపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. గగనతలం నుంచి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. తన అభిమాన నేత కవితక్క జన్మదినం సందర్భంగా ఆకాశం నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు.
దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో గగనతలంపై మినీ ప్లేన్ ద్వారా ఎమ్మెల్సీ కవితకు బర్త్ డే విషెస్ తెలిపాడు తెలంగాణ జాగృతి సెక్రటరీ రోహిత్ రావు. ప్రత్యేక మినీ ప్లేన్కు ‘‘హ్యాపీ బర్త్ డే కవితక్క’’ అని రాసి ఉన్న ఫ్లెక్సీని కట్టి గాల్లో రౌండ్లు కొడుతూ ఎమ్మెల్సీ కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. @RaoKavitha pic.twitter.com/DbNo7ulbAu
— Namasthe Telangana (@ntdailyonline) March 13, 2022