హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతిని పురసరించుకుని జన్ జాతీయ గౌరవ దివస్ ఉత్సవాలను గిరిజన సంక్షేమ శాఖ శనివారం నిర్వహించింది. అందులో భాగంగా మాసబ్ట్యాంకులోని గిరిజన మ్యూజియంలో బిర్సా ముండా, రాంజీ గోండు, కుమ్రం భీం విగ్రహాలకు అధికారులు నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థులకు గిరిజన సంస్కృతి, చిత్రకళలో పోటీలు నిర్వహించారు.
గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల వీడియోలు చూపించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ సంయుక్త సంచాలకుడు పోచం, ఉప సంచాలకురాలు ప్రియాంక, మణెమ్మ, మ్యూజియం క్యురేటర్ డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ, పరిశోధన సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.