హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ టీచర్లకు బయోమెట్రిక్ హాజరు అమలుచేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేలు డిమాండ్ చేశారు. టీచర్లు స్కూళ్లకు వెళ్లడం లేదని ఆరోపించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. కొన్ని నెలల క్రితం తాను తుంగతుర్తిలోని ఓ రెసిడెన్షియల్ పాఠశాలను విజిట్ చేసినప్పుడు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు.
టీచర్లే కాపీ కొట్టిస్తున్నారు ; ఎమ్మెల్యే కవ్వంపల్లి
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు దారుణంగా ఉన్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. 10వ తరగతి విద్యార్థులు కొందరికి అక్షరాలు, లెక్కలు రాని పరిస్థితి ఉన్నదని, అయినప్పటికీ 90 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారంటే దీని వెనుక కారణం.. ఉపాధ్యాయులే విద్యార్థులతో కాపీ కొట్టించి బయటకు పంపుతున్నట్టు ఆరోపించారు.