హైదరాబాద్, సెప్టెంబర్21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖాన్లలో తక్షణమే బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సెక్రటేరియట్‌లోని తన చాంబర్లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని శనివా రం నిర్వహించారు. ప్రభుత్వం నియమించిన టాస్‌ఫోర్స్ కమిటీలు, ఫుడ్ సెక్యూరిటీ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలోని డైట్ క్యాంటీన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. హెల్త్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్‌నాయక్ పాల్గొన్నారు.