హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని బయో డీగ్రేడబుల్ పాలిమర్ల తయారీపై హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) దృష్టి సారించింది.
వినియోగంలో ఉన్న ప్లాస్టిక్స్తో పోలిస్తే సహజ సిద్ధంగా లభించే పాలీశాచ్యురైడ్లు, ప్రొటీన్లు, లిపిడ్లు, పిండి పదార్ధాలతో తయారయ్యే బయో డీగ్రేడబుల్ పాలిమర్లు సులభంగా మట్టిలో కలిసిపోతాయని పరిశోధకులు గుర్తించారు.