హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): లోక్‌భవన్‌లో ఆదివారం బీహార్ ఫౌండేషన్ డే (బీహార్ దివస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయన సతీమణి జానకి శుక్లాతో హాజరయ్యారు. ఈ సందర్భంగా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన బీహార్ నాయకులు, ప్రజలను అభినందించారు. ఈ దినోత్సవంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉన్నదని తెలిపారు. బీహార్ సాంస్కృతిక, రాజకీయ, విద్యావారసత్వం కలిగి ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి దాన కిషోర్, అదనపు డిజీ విజయ్‌కుమార్ బీహార్ ప్రతినిధులు పాల్గొన్నారు.