నల్లగొండ, జూలై 14 : ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందనలు తెలిపారు. శభాష్.. హిమాన్షు అంటూ కితాబునిచ్చారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. హైదరాబాద్లోని కేశవ్నగర్ ప్రభుత్వ పాఠశాలను దాదాపు కోటి రూపాయలు సమీకరించి కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడం మంచి విషయమని కొనియాడారు. చిన్న వయస్సు అయినప్పటికీ తోటి విద్యార్థుల ఇబ్బందులకు చలించి మౌలిక వసతులు కల్పించడం సంతోషకరమని తెలిపారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఆలోచనతో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.