T-20 Cricket Leagu | టీ-20 విజేత భూపాలపల్లి.. రన్నరప్ హనుమకొండ
కాకా వెంకటస్వామి(Kaka Venkataswamy) మెమోరియా ఇంటర్ డిస్ట్రిక్ట్ టి-20 క్రికెట్ లీగ్ ఫైనల్ తలపడిన హనుమకొండ-భూపాలపల్లి జిల్లాల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భూపాలపల్లి జట్టు విజేతగా నిలిచింది.
హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 26: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి(Kaka Venkataswamy) మెమోరియా ఇంటర్ డిస్ట్రిక్ట్ టి-20 క్రికెట్ లీగ్ ఫైనల్ తలపడిన హనుమకొండ-భూపాలపల్లి జిల్లాల మధ్య హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భూపాలపల్లి జట్టు విజేతగా నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న హనుమకొండ జట్టు 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు సాధించింది. హనుమకొండ జట్టులో పవన్‌రాజ్ 36, ప్రదీప్ 27 పరుగులతో రాణించగా భూపాలపల్లి బౌలర్ 4 వికెట్లతో కట్టడి చేశాడు.
108 పరుగుల లక్షఛేదనలో బరిలోకి దిగిన భూపాలపల్లి జట్టు మరో 6 బంతులు మిగిలి ఉండగానేలో అవినాష్‌రెడ్డి 58 పరుగులు సాధించి విజయంలో కీలక భూమిక సాధించాడు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అచ్చ వెంకటేశ్వర్రావు, రఘురాం, రాము, సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్, కార్యవర్గ సభ్యులు అభినవవినయ్, శంకర్ పాల్గొన్నారు. ఈనెల 29 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ టీ-20కి జట్టును ఎంపిక చేసినట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు.
జట్టు వివరాలు: కె ప్రదీప్(హన్మకొండ), కి.రోహిత్ రెడ్డి(హన్మకొండ), చంద్ర(వరంగల్), ఎం.శివరాంకృష్ణ(జనగాం), పి.రిష్యాంత్(వరంగల్), జి.పవన్‌రాజ్(హన్మకొండ), ఎన్.రాహుల్(వరంగల్),
ఎస్.ఆదర్శ్(భూపాలపల్లి), జే.పర్దీపన్(హన్మకొండ), ఏ.నాగరాజు(భూపాలపల్లి), త్రిశూల్(హన్మకొండ), జి.సాయికుమార్(మహబూబాబాద్), ఎస్డి.రియాజ్ (ములుగు), ఆశ్లేష్వర్మ(హైదరాబాద్), కె.శ్రీఅఖిలేష్ (హైదరాబాద్), ఆకాష్ కుర్రె (హైదరాబాద్), ఆవుల నిక్షిత్(హైదరాబాద్), అరుష్ పావులేచి (హైద్రాబాద్)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

