భూదాన్‌పోచంపల్లికి ‘బెస్ట్ టూరిజం విలేజ్’ అవార్డు ప్రదానం
Bhudan Pochampally awarded the 'Best Tourism Village' award | ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా ఎంపికైన భూదాన్‌పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అధికారులు ప్రదానం చేశారు. ఐక్యరాజ్య

హైదరాబాద్ : ‘బెస్ట్ టూరిజం విలేజ్’గా ఎంపికైన భూదాన్‌పోచంపల్లి గ్రామానికి స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అధికారులు ప్రదానం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ (UNWTO) వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ 24వ సమావేశంలో అవార్డు అందజేశారు. భారత కాలమాన ప్రకారం.. ఇవాళ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. అవార్డును భారత్ తరఫున స్పెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం రెండో కార్యదర్శి సుమన్ శేఖర్ స్వీకరించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో పర్యాటకరంగం అద్భుతమైన ప్రగతి
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ పర్యాటకరంగం అద్భుతమైన ప్రగతి సాధిస్తుందన్నారు. ఏడు సంవత్సరాల్లోనే అంతర్జాతీయ స్థానంలో బెస్ట్ టూరిజం విలేజ్‌గా భూదాన్‌పోచంపల్లి గ్రామానికి యూఎన్‌డబ్ల్యూటీఓ అవార్డు ప్రదానం చేసినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో ప్రాంతీయ అసమానతలు తగ్గించి, గ్రామాల నుంచి వలస వెళ్లే వారి సంఖ్యను తగ్గించటానికి జరిపే కృషిలో పర్యాటక రంగం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (SGD)కు అనుగుణంగా, సుస్థిరతకు మూడు స్తంభాలైన ఆర్థిక, సామాజిక, పర్యావరణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు యూఎన్డబ్ల్యూ టీఓ అవార్డుకు ఎంపిక చేసిందని మంత్రి పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

