హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2నుంచి భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ సమస్యలకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 17నుంచి 30వరకు నాలుగు మండలాల్లో, ఈనెల 5నుంచి 30వరకు 28 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద సదస్సులు నిర్వహించినట్టు వివరించారు. జూన్ 2నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని జీహెచ్ఎం సీపరిధిలో 24, మహబూబ్‌నగర్, బోధన్, నిజామాబాద్, సరూర్‌నగర్ జల్పల్లి మున్సిపాలిటీల్లో ఒక్కొక్క బార్ కలిపి మొత్తం 28(2బీ) బార్లకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈనెల 15 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపింది. గతం లో 2బీ బార్లకు దరఖాస్తులు పిలిచిన సందర్భంలో బార్ లైసెన్స్ పొంది లైసెన్స్ ఫీజు చెల్లించకపోవడం, ఇతర కారణాలతో రద్దు చేసుకున్న వాటిని తిరిగి పునరుద్ధరించడంలో భాగంగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఎన్నికల జాబితాను సరిచేసి ఆధునీకరించడంలో భాగంగా 20 ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఓ సమస్యను కూడా పరిష్కరించింది. 2005 నుంచి వేధిస్తున్న ఒకే రకం ఎపిక్ (ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు) నంబర్ల సమస్యను తీర్చింది. వివిధ ఎన్నికల అధికారులు (ఈఆర్వోలు) ఒకే సిరీస్‌ను ఉపయోగించ డం వల్ల ఈ సమస్య తలెత్తినట్టు ఈసీ ఐ వర్గాలు తెలిపాయి.