కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 26 : ‘భూభారతి చట్టం’పై అవగాహన కోసం రైతులను ఆహ్వానించకుండా సదస్సు ఎలా నిర్వహిస్తారని అన్నదాతలు భగ్గుమన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని పద్మశాలీ భవన్లో ‘భూభారతి చట్టం’పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్డీవో శ్రీను హాజరయ్యారు. కాగా.. వేదికపై, హాలులో కాంగ్రెస్ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు తప్ప రైతులు లేకపోవడంతో రైతులు, బీజేపీ నాయకులు అధికారులను నిలదీశారు. ఎవరి కోసం సదస్సు అని నిలదీశారు. సమాధానమివ్వకుండానే తూ తూ మంత్రంగా సదస్సు నిర్వహించారు.