శ్రీశైలం : భోగి పండుగను పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానం(Srisailam Temple) సామూహిక భోగిపండ్ల(Bhogi pandlu) కార్యక్రమాన్ని నిర్వహించింది. అయిదు సంవత్సరాల వయస్సు వరకు గల చిన్న పిల్లలకు భోగింపండ్లు వేసి, వారిని ఆశీర్వదించారు. 50 మంది పైగా చిన్నారులకు ఆలయప్రాంగణంలో భోగిపండ్లు పోశారు. అంతకుముందు అర్చకులు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు.
Whatsapp Image 2024 01 14 At 18.44.52
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సనాతన సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవస్థానం ఈ సామూహికంగా భోగింపడ్లు పోసే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ భోగిపండ్లను వేయడం వలన పిల్లలకు పీడలు తొలగి, దృష్టిదోషాలు నశించి, ఆయురారోగ్యాలు చేకూరుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్ది రాజు దంపతులు, ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వాహణాధికారి ఐఎస్వి. మోహన్ స్వామి ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.