Kamareddy | దీపావళి రోజు దక్షిణాఫ్రికాలో తెలంగాణ వాసి మృతిచెందాడు. దక్షిణాఫ్రికాలో కామారెడ్డి జిల్లా భిక్కనూర్కు చెందిన బత్తుల శ్రీనివాస్ (32) అనుమానాస్పదస్థితిలో మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే.. భిక్కనూర్కు చెందిన బత్తుల శ్రీనివాస్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లాడు. అక్కడ బోరింగ్ డ్రిల్లర్, డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే సోమవారం నాడు చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో తెలంగాణలోని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. తమ కొడుకు మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, మృతునికి భార్య నవిత, కూతురు లాస్య, కొడుకు నిహాల్ ఉన్నారు.