హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాజీవ్ యువవికాసం పథకం ద్వారా యువత జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం అధికారులు అంకితభావంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార ఆదేశించారు. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి యువవికాసంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 5లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తిచేసి, జూన్ 2 నుంచి 9 వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని చెప్పారు.
డీ-అడిక్షన్ సెంటర్ ప్రారంభం
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): యువతలో మాదక ద్రవ్యాల వ్యసనం వ్యాపిస్తున్నదని మంత్రి సీతక్క తెలిపారు. మాదకద్రవ్యరహిత తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సైదాబాద్‌లోని అబ్జర్వేషన్ హోమ్‌లో డీ అడిక్షన్ సెంటర్‌ను సీతక్క ప్రారంభించారు. ఈ సెంటర్ ప్రత్యేక మానసిక నిపుణుల బృందం ఆధ్వర్యంలో నడుస్తుందని, దీని వార్షిక నిర్వహణకు రూ.13.80 లక్షలు మంజూరు చేసినట్టు చెప్పారు.