హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): భారత జాగృతి ఇటలీ అధ్యక్షుడిగా తానింకి కిశోర్యాదవ్ను భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించినట్టు జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి శనివారం తెలిపారు. ప్రవాస భారతీయుల సంక్షేమానికి, సాంస్కృతిక పరిరక్షణకు పాటుపడుతున్న భారత జాగృతి ఇప్పటికే పలు దేశాల్లో శాఖలను ఏర్పాటు చేసిందని చెప్పారు. భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శిగా అనంతుల ప్రశాంత్, గద్వాల జిల్లా అధ్యక్షుడిగా ఎల్వీఎన్రెడ్డి, సిద్దిపేట అధ్యక్షుడిగా పీ శ్రీధర్‌రావు, హైదరాబాద్ జిల్లాకు అప్పాల నరేందర్‌యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లాకు చందుపట్ల సుజీత్‌రావు, మెదక్‌కు వీరప్పగారి రమేశ్‌గౌడ్, హనుమకొండకు మూల రాముగౌడ్‌ను అధ్యక్షుడిగా నియమించారు. హైదరాబాద్ జిల్లా కోకన్వీనర్‌గా బీ వేణుగోపాల్‌రావు, యువజన విభాగం రాష్ట్ర కోకన్వీనర్‌గా బొల్లంపల్లి సందీప్‌ను నియమించినట్టు నవీన్ ఆచారి తెలిపారు.