పిల్లల్లో కొవాగ్జిన్ పనితీరు భేష్
- 2-18 ఏండ్లవారిలో సమర్థంగా పనితీరు
- భారత్ బయోటెక్‌కు ‘లాన్సెట్’ ప్రశంస
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ కల్పించేందుకు హైదరాబాద్ సంస్థ భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకాకు విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. పిల్లల్లో ఈ టీకా అత్యంత సమర్థంగా పనిచేస్తునట్టు ఇటీవల జరిగిన పరిశోధనల్లో వెల్లడైందని ‘లాన్సెట్ జర్నల్’ పేరొన్నది. 2 నుంచి 18 ఏండ్లవారికి కొవాగ్జిన్ ఎంతో సురక్షితమైనదిగా తేలినట్టు వెల్లడించింది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ టీకా 1.7 రెట్లు సమర్థంగా పనిచేస్తున్నట్టు ఫేజ్-2, 3 క్లినికల్ ట్రయల్స్‌లో తేలిందని లాన్సెట్ పేరొన్నది. పిల్లల్లో కొవాగ్జిన్ పనితీరును పరిశీలించేందుకు గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. వీటి ఫలితాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం 6-18 ఏండ్లవారికి కొవాగ్జిన్ టీకా అందించేందుకు అనుమతులు జారీచేసింది. ఇప్పుడు లాన్సెట్ జర్నల్ సైతం కొవాగ్జిన్ పనితీరును ప్రశంసించడంపై భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు భారత్‌లో పిల్లలకు సుమారు 50 మిలియన్ల కొవాగ్జిన్ డోసులు ఇచ్చామని, వారిలో ఎలాంటి దుష్పరిణామాలు తలెత్తలేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

