Ganesh Immersion | ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. ఆ ఫ్లెక్సీలు, బారికేడ్లను తొలిగిన గణేశ్ ఉత్సవ సమితి
వినాయక నిమజ్జన (Ganesh Immersion) వేల ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం చేశారు.
హైదరాబాద్: వినాయక నిమజ్జన (Ganesh Immersion) వేల ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం చేశారు. అనేక ఏండ్లుగా ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం జరుగుతుందని.. ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని ఉత్సవ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022, 2023లో కూడా ఇలాగే చేశారని, చివరకు ట్యాంక్బండ్లోనే గణేష్ నిమజ్జనాలు జరిగాయని గుర్తుచేశారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్‌ఫై వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా సోమవారం ఆందోళనలు చేస్తామన్నారు.
‘ట్యాంక్‌బండ్‌పై ప్రభుత్వం వెంటనే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలి. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’ అని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి హెచ్చరించారు.
ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం లేదంటూ ఫ్లెక్సీలను, బారికేడ్లను, జాలీలను ఏర్పాటు చేసిన పోలీసులు
ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం చేసిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు
ప్రభుత్వం వెంటనే ట్యాంక్‌బండ్‌పై గణేష్… https://t.co/XEYBRPU0MV pic.twitter.com/gFIAWObj8a
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

