భద్రాద్రి పుణ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం భద్రగిరీశుడు వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఆండాళ్ అమ్మవారికి పాశురాలను విన్నవించారు. ఒమిక్రాన్ నేపథ్యంలో అమ్మవారికి, స్వామివారికి తిరువీధి సేవలు నిలిపివేశారు. ప్రముఖ దివ్యక్షేత్రమైన పర్ణశాలలో స్వామివారు పరశురామావతారంలో దర్శనమిచ్చారు. – భద్రాచలం/ పర్ణశాల